Return of the Dragon: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

రీసెంట్ గా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) చిత్రంతో మన ముందుకొచ్చాడు

Update: 2025-03-01 02:43 GMT
Return of the Dragon: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : " లవ్ టుడే " మూవీతో  (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్  (Pradeep Ranganathan) ఎంత పెద్ద విజయం సాధించాడో మనందరికీ తెలిసిందే. ప్రదీప్ ను ఫ్యాన్స్ జూనియర్ ధనుష్ పిలుస్తారు. రీసెంట్ గా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) చిత్రంతో మన ముందుకొచ్చాడు. ప్రస్తుతం, ఈ మూవీ అన్ని చోట్లా దూసుకెళ్తుంది. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. " ఓరి దేవుడా " మూవీకి డైరెక్షన్ చేసిన ఫేమ్ అశ్వథ్ (Ashwath Marimuthu) ఈ మూవీని తెరకెక్కించాడు. తెలుగులో కాకుండా తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.శివరాత్రి సెలవు కలిసి రావడంతో బాగానే క్యాష్ చేసుకుంది. రేసులో సరైన సినిమాలు లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..

నైజాం - 01.98 cr

సీడెడ్ - 0.60 cr

ఆంధ్ర(టోటల్) - 1.72 cr

ఏపీ + తెలంగాణ(టోటల్) - 4.30 cr

" రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ " (Return of the Dragon) మూవీకి తెలుగులో రూ.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ( pre release business )  జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.5 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది . మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.4.30 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ లెక్కలు చూస్తే మొత్తం రూ.7.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కి రూ.0.80 కోట్ల లాభాలు కూడా తెచ్చి పెట్టింది. లాంగ్ రన్ లో ఇలాగే కొనసాగితే మరింత క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News