Rashmika Mandanna: టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న రష్మిక.. ఎట్టకేలకు హింట్ ఇచ్చిన సినీ నిర్మాత (వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చేతినిండా మూవీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుబేర, చావా, సికందర్(Sikander) వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక రష్మిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గత కొద్ది కాలం నుంచి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ నిత్యం రష్మిక, విజయ్‌కు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇటీవల వీరిద్దరు ఇటీవల ఎయిర్ పోర్ట్‌లో ఎక్కడికో వెళ్తూ కనిపించడంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లారని అంతా చర్చించుకున్నారు. ఇక విజయ్ ఇంట్లో ఏ పండుగ అయినా రష్మిక కచ్చితంగా వెళ్తుంది.
దీంతో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా, టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (Naga Vamsi)అన్‌స్టాపబుల్ షోలో రష్మిక పెళ్లిపై హింట్ ఇచ్చాడు. ఈ షోలో హోస్ట్‌గా చేస్తున్న బాలయ్య(Balakrishna) నాకు రష్మిక అంటే క్రష్ ఆమెకు పెళ్లి సెట్ అయినట్లు ఉంది కాదా అంటే.. దాని నాగవంశీ ‘‘అవును తెలుగు ఇండస్ట్రీలో హీరోను పెళ్లి చేసుకుంటుంది తెలుసు సర్. కానీ ఎవరు ఏంటి అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అతని వివరాలు వెల్లడించట్లేదు’’ అని అంటాడు. ప్రస్తుతం నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారు విజయ్ దేవరకొండనే చేసుకోబోతుందని చర్చించుకుంటున్నారు.
Read More ...
Rashmika Mandanna: రిషబ్ శెట్టి, రష్మిక మధ్య గొడవలు.. ఒక్క ట్వీట్‌తో బయటపడ్డ అసలు నిజం!