Game Changer: ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన రామ్ చరణ్ .. కనిపించని "హైరానా" పాట.. కారణం ఇదే!

ఆ పాట ఎక్కడికిపోయింది? అని అనుకుంటూ థియేటర్ బయటకు జనాలు వస్తున్నారు

Update: 2025-01-10 03:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన మూవీ "గేమ్ ఛేంజర్" ( Game Changer) శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి నటీ నటులు నటించారు. భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ప్రస్తుతం, ఈ మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ నటించిన ఈ మూవీకి ఇప్పుడు మిక్స్డ్ టాక్ ఎక్కువగా వస్తోంది. మెగా ఫ్యాన్స్ సూపర్ అని అంటుంటే.. యాంటీ ఫ్యాన్స్ యావరేజ్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఇక న్యూట్రల్ ఆడియెన్స్ టాక్ తెలియాలంటే కొంత సమయం పట్టేలా ఉంది. ఇక "గేమ్ ఛేంజర్" టాక్ గురించి కాసేపు పక్కన పెడితే.. రిలీజ్ కు ముందు "నానా హైరానా" ( Nana Hyraana ) పాటను అంత హైలెట్ చేసి, చివరకు సినిమాల్లోంచి తీసేశారు ఏంటని మూవీకి వెళ్ళిన వారంతా షాక్ అవుతున్నారు. ఆ పాట ఎక్కడికిపోయింది? అని అనుకుంటూ థియేటర్ బయటకు జనాలు వస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన చిత్ర బృందం " కొన్ని సాంకేతిక సమస్యల వలన "నానా హైరానా" సాంగ్ ను విడుదల చేయలేకపోతున్నాము. జనవరి 14 నుంచి ఈ పాటని సినిమాలో యాడ్ చేస్తామని " తెలిపారు.

Full View
Tags:    

Similar News