Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఖతర్నాక్ ఫొటో షూట్..!!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుస సినిమాలతో దూసుకుపోయింది. అల్లు అర్జున్(Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), రామ్ పోతినేని(Ram), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(global star Ram Charan), మాస్ మహారాజా రవితేజ(Mass. Maharaja Ravi Teja) వంటి ప్రముఖ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. నాన్నకు ప్రేమతో(Nannaku prematho), ధృవ(Dhruva), సరైనోడు(Sarainoḍu), వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్(Venkatradri Express), కిక్- 2 (Kick), పండగ చేస్కో(Paṇḍaga chesko) వంటి చిత్రాలు ఈ అమ్మడుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రజెంట్ సినిమా అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి సెట్ చేసుకుని.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ మోడల్ డ్రెస్ ధరించి.. ఖతర్నక్ ఫొటో షూట్ చేసింది. చేతికి డిఫరెంట్ మోడల్ బ్రాచ్‌లైట్ పెట్టుకుని ఓరచూపు చూస్తూ.. యువతను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.