SS రాజమౌళి నోట ‘OG’ మాట

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)-మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Update: 2025-01-02 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)-మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ట్రైలర్‌కు లాంచ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు SS రాజమౌళి(SS Rajamouli) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందటే పాన్ ఇండియా సినిమాలు తీసి ఇండియాను షేక్ చేసిన దర్శకుడు శంకర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. డైరెక్టర్లలో శంకర్ అసలైన ‘OG’ అని కొనియాడారు. కచ్చితంగా గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా.. గేమ్‌ ఛేంజర్‌లో కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్‌(Srikanth), నవీన్‌చంద్ర, సముద్రఖని, ఎస్‌జే సూర్య, జయరాం, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

Read More ....

SSMB29 మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఏడాదిన్నరలో రాబోతోంది : రామ్ చరణ్


Tags:    

Similar News