Pushpa-2: ‘పుష్ప-2’ ఎఫెక్ట్.. ఇండస్ట్రీలో మొదలైన కొత్త టెన్షన్‌లు!
అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2’ (Pushpa-2) ప్రిమియర్ షో కారణంగా.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2’ (Pushpa-2) ప్రిమియర్ షో కారణంగా.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ (Sreetej) తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రి (Kim's Hospital)లో చికిత్స పొందుతున్నాడు. ప్రజెంట్ ఈ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. అయితే.. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇకపై ప్రీమియర్ షో (Premier Show)లు, బెనిఫిట్ షో (Benefit Show)లు ఉండవని, టికెట్ల రేట్లు పెంచడం ఉండదని తెలిపారు. ఈ దెబ్బతో ఇండస్ట్రీలో ఓ కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు బెనిఫిట్ షోలు లేకపోయిన, టికెట్ రేట్లు పెంచకపోయిన దాని ఎఫెక్ట్ సినిమాపై చాలా పడుతుండి. ఎందుకంటే.. ఓ స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఫ్యాన్స్ (fans)తో పాటు సిని ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. టికెట్ రేట్ ఎంతైనా వెనకడుగు వెయ్యకుండా ప్రీమియర్, బెనిఫిట్ షోల కోసం ఎగబడతారు. దీంతో సినిమా హిట్, ఫట్ అన్నది పక్కన పెడితే.. కలెక్షన్లు (Collections) మాత్రం బాగానే రాబడతాయి.
మరి ఇప్పుడు బెనిఫిట్, ప్రీమియర్ షోలు లేకపోవడంతో పాటు టికెట్లు రేట్లు కూడా పెంచేదే లేదు అని తెలంగాణ గవర్నమెంట్ తెలపడంతో.. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు బొమ్మ రివర్స్ అవ్వడం ఖాయమా అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ (box office) వద్ద కలెక్షనల్లు ఎంతవరకు వస్తాయి అనే టెన్షన్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది. మరి ఈ సంక్రాంతిలోపు ఏదైనా జరుగుందా.. లేదా పరిస్థితి ఇలాగే ఉంటే.. సంక్రాంతికి పోటి పడుతున్న పెద్ద హీరోల సినిమాలు రామ్ చరణ్, శంకర్‌ల ‘గేమ్ చేంజర్’ (Game Changer).. వెంకటేష్, అనీల్ రావిపూడిల ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) ఈ మేరకు ఎంత వరకు కలెక్షన్లు రాబడతాయి అనేది తెలియాలంటే.. వేచి చూడాల్సి ఉంది.
Read More...
Pushpa-2: అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేసిన అధికారులు