Priyanka Chopra:‘వచ్చే ఏడాది పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తా’: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ అగ్ర తార ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర తార ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ భామ ఎన్నో బ్లాక్ చిత్రాల్లో నటించి.. తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ తారకు కోట్లాది మంది అభిమానులున్నారనడంలో అతిశక్తిలేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్(Hollywood)లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ బాలీవుడ్(Bollywood)కు ఎప్పుడొస్తుందని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అందాల ముద్దుగుమ్మ అభిమానులకు ఓ శుభవార్త అందించింది. వచ్చే సంవత్సరం (2025) బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్టులో నటించబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. ఇండియన్(Indian)చిత్రాలేప్పుడు తన మనసుకు దగ్గరగానే ఉంటాయని వెల్లడించింది. కాగా మళ్లీ తన ఫ్యాన్స్ కోసం హిందీ సినిమాలో యాక్ట్ చేయబోతున్నానని.. ఇందుకు చాలా ఆసక్తిగా ఉందని తెలిపింది. తొందర్లోనే ఆ మూవీకి సంతకం చేస్తానని.. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ టైమ్ లేదని పేర్కొంది. ఈ చిత్రం గురించి వచ్చే సంవత్సరం పూర్తి డిటైయిల్స్ అఫిషీయల్‌గా అనౌన్స్ చేస్తానని.. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేలా ఉంటుందని ప్రియాంక చెప్పుకొచ్చింది. సినీ రంగంలో నటిగా రాణిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా 18 ఏళ్లకే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానని.. అప్పటి నుంచి జనాల్ని ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్‌లో చాలా అనుభవాలు,మెమోరీస్ ఉన్నాయని ప్రియాంక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.