Samantha: ఆ విషయం నాకు మాత్రమే తెలుసు.. శోభిత- నాగచైతన్య గురించి సమంత పోస్ట్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ప్రేమించుకుని ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-15 13:29 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ప్రేమించుకుని ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెద్దలను ఒప్పించి డిసెంబర్ 4న గ్రాండ్‌గా పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహం అతికొద్ది మంది సమక్షంలో అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు. వీరితో పాటు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

అయితే ఈ పెళ్లిలో శోభిత చెల్లి సమంత(Samantha) కూడా పాల్గొని సందడి చేసింది. ఇన్ని రోజులకు ఆమె పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్(Emotional moment) అక్కా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు. అత్యంత గౌరవప్రదమైన జంట శోభిత, చైతు అని నాకు తెలుసు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


Read More...

Samantha: 'నేనేమి ఏడ్వటం లేదు, ఓకే'.. ఆ స్టార్ హీరో సాంగ్‌తో సమంత ఎమోషనల్ పోస్ట్





Tags:    

Similar News