Vijay Sethupathi: ఎంతో గర్వంగా ఉంది: విజయ్‌ సేతుపతి

విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వెట్రీమారన్‌ (vetreemaran) కాంబోలో వచ్చిన 'విడుదల-1' (Vidudala-1) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-15 15:40 GMT

దిశ, సినిమా: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వెట్రీమారన్‌ (vetreemaran) కాంబోలో వచ్చిన 'విడుదల-1' (Vidudala-1) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' (Vidudala-1) రాబోతుంది. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకోగా.. ప్రమోషన్స్‌ (Promotions)ల్లో భాగంగా హీరో విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ మంజు వారియర్‌ (Manju Warrior) ఆదివారం హైదరాబాద్‌ (Hyderabad)కు విచ్చేశారు. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా హీరో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘‘విడుదల-2’ సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఇచ్చే సపోర్ట్‌ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల నా మహారాజా చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేశారు. ఆ కోవలోనే విడుదల-2 కూడా మిమ్ములను ఎంతగానో అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్‌ అవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాలి. అందరిని ఎంతో సంతృప్తి పరిచే చిత్రమిది’ అన్నారు.

Tags:    

Similar News