Manchu Manoj: నీ వల్లే ఇదంతా అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్.. ఎవరి గురించంటే?
గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా(Social Media)లో ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గొడవల గురించే వార్తలు వస్తున్నాయి.
దిశ, సినిమా: గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా(Social Media)లో ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ గొడవల గురించే వార్తలు వస్తున్నాయి. ఇటీవల మంచు మనోజ్, మోహన్ బాబు(Mohan Babu) ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడంతో దుమారం రేపింది. అంతేకాకుండా మంచు మనోజ్ తండ్రి ఇంటికి వెళ్లగా వాచ్‌మెన్ లోపలికి వెల్లనివ్వలేదు. తన కూతురు లోపల ఉందని ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ఒకటి బయటకు రావడంతో మంచు ఫ్యామిలీలో జరిగే గొడవలు నిజమే అని అంతా ఫిక్స్ అయ్యారు.
ఇక వారి గురించి అంతా పలు రకాలుగా చర్చించుకోవడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన నేడు దాడిలో గాయపడిన రిపోటర్‌కు, మీడియాకు క్షమాపణలు చెప్పారు.ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు మనోజ్(Manchu Manoj) తన తల్లికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘‘హ్యాపీ బర్త్ డే(Happy Birthday) అమ్మ. మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్‌ప్సైర్ చేస్తుంది. నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉండగలుగుతున్నాము. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే ఎల్లప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేను కూడా నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లితో కలిసి దిగిన ఫొటోలు కూడా షేర్ చేశారు.
Read More...