జాకీర్ హుస్సేన్ బతికే ఉన్నారు..
ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణించారని వచ్చిన వార్తలు ఖండించిన కుటుంబసభ్యులు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్(73) మరణించారని వస్తున్న వార్తలను ఆయన కుటుంబసభ్యులు ఖండించారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్టు నేషనల్, ఇంటర్నేషనల్ వార్తా సంస్థలు ప్రకటించాయి. ఐ అండ్ పీఆర్ శాఖ సహా తెలుగు రాష్ట్రాల నేతలు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు సంతాపాలు తెలిపారు. అయితే, జాకీర్ హుస్సేన్ అల్లుడు అమీర్ ఈ వార్తలను ఖండించారు. ఆయన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని.. చికిత్స తీసుకుంటున్నారని ప్రకటించారు. చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. నిజానికి జాకీర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యతో ఆయన గతకొంతకాలంగా బాధపడుతున్నారు. తొలుత ఆయన మరణ వార్త విని ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. మరణవార్త నిజంకాదని తెలిసి అభిమానులు ఊరడిల్లారు.