మెడలో తాళి బొట్టుతో పార్టీకి వెళ్లిన హీరోయిన్.. అందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి అని అంటున్న నెటిజన్లు

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-19 09:20 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 15 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట గోవాలో గ్రాండ్‌గా తెలుగు సంప్రదాయంలో మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా హీరోయిన్స్ చాలా మంది తమకి మ్యారేజ్ అయినా కూడా మెడలో ఒక్కరోజు కూడా తాళి ఉంచుకోరు. ఫ్యాషన్ అంటూ వాటిని తీసి బీరువాలో పెట్టేస్తారు.

ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ హీరోయిన్ మెడలో కూడా తాళి కనిపించదు. అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ముంబైలో జరిగిన ఓ పార్టీకి వెళ్లింది. అక్కడికి మోడ్రన్ డ్రెస్‌‌లో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్లింది. దీంతో మహానటి మోడ్రన్ డ్రెస్‌లో మంగళ సూత్రంతో కనబడిన వీడియోను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మిగతా హీరోయిన్స్ కూడా నిన్ను చూసి నేర్చుకోవాలంటూ కీర్తిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. మరి మీరు ఈ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

Tags:    

Similar News