Naveen Polishetty: యాక్టింగ్‌తో పాటు ఆ టాలెంట్ ఉన్న నవీన్ పొలిశెట్టి.. చూస్తే వావ్ అనాల్సిందే!(వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అందరికీ సుపరిచితమే. ‘జాతి రత్నాలు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Update: 2024-08-23 08:07 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అందరికీ సుపరిచితమే. ‘జాతి రత్నాలు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనుష్క శెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే మూవీ చేశాడు. కానీ, అనుకున్నంత విజయం అయితే సాధించలేకపోయాడు. ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యాడు. అందులో భాగంగా గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్న నవీన్.. రీసెంట్‌గా తనకు యాక్సిడెంట్ అయ్యిందని పోస్ట్ ద్వారా తెలియజేశాడు. అప్పుడు అతని ఫ్యాన్స్, నెటిజన్లు ఈ విషయం తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలో తాజాగా గాయం నుంచి కోలుకున్న నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, శుక్రవారం, శనివారాల్లో రాబోతున్న ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్‌తో అదరగొట్టారు.

తాజాగా నవీన్ పొలిశెట్టి ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో గెస్ట్‌గా పాల్గొన్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో నెట్టింట ఆకట్టుకుంటుంది. ఆ ప్రోమోలో భాగంగా.. నవీన్ పొలిశెట్టి తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్‌తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. అంతే కాకుండా యాక్టింగ్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవీన్.. రెండు పాటలు పాడి జడ్జ్‌లకు సైతం షాక్‌కు గురిచేశాడు. అందులో భాగంగా సింగర్ గీతా మాధురి మీరు ఇంకా సింగింగ్‌లోకి వస్తే తట్టుకోవడం కష్టమే అంటూ పొగడ్తలతో ముంచెత్తేసింది. అంతే కాకుండా ఈయన వాయిస్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అంతే కాకుండా ఈ ప్రోమోలో చాలా హైలెట్స్ వున్నాయి. నవీన్ గాయం నుంచి కోలుకునే క్రమంలో ఆ కష్టమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు నిజంగా హార్ట్ టచ్చింగ్‌గా అనిపించింది. ఇక ఈ ఎపిసోడ్‌లో నవీన్ పేల్చిన కామెడీ పంచులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ఈ ఎంటర్ టైన్మెంట్ ఫుల్ ఎపిసోడ్ ఆహా‌లో శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది

Full View

(video link credits to aha videoin youtube channel)

Tags:    

Similar News