Naga Vamsi: రష్మిక ఆ హీరోనే పెళ్లి చేసుకుంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగవంశీ
విజయ్ వెళ్ళిన ప్రదేశాలకే రష్మిక కూడా వెళ్లడం, అతని ఇంట్లోనే ఈ ముద్దుగుమ్మ అన్ని పండుగలు జరుపుకోవడం
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda) - రష్మిక మందన (Rashmika Mandanna)చాలా కాలం నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ వెళ్ళిన ప్రదేశాలకే రష్మిక కూడా వెళ్లడం, అతని ఇంట్లోనే ఈ ముద్దుగుమ్మ అన్ని పండుగలు జరుపుకోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
మీడియాకి ఈ జోడి ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నా.. అభిమానులు మాత్రం వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే, రీసెంట్ గా చెన్నైలో జరిగిన 'పుష్ప 2' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెళ్లి గురించి అడగగానే రష్మిక మెలికలు తిరిగిపోయింది. ఇప్పుడు, రష్మిక పెళ్ళిపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'డాకు మహారాజ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అన్‌స్టాపబుల్' షో'లో చిత్ర బృందం సందడి చేశారు. అయితే, తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. దీనిలో బాలయ్య.. 'నాకు రష్మిక అంటే ఇష్టం, అయిన రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా.. తికమక ప్రశ్న అడిగారు. దీనికి నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయ్యారు.. " అక్కడో ఇక్కడో కాదు.. తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటుందని అందరికీ తెలుసు కదా సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా..' అని అన్నారు. దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు హీరో అనడంతో విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. మరి, ఈ జోడి రాబోయే రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాల్సి ఉంది.