‘శక్తిమాన్‌గా ఆ హీరోనే కరెక్ట్’.. టాలీవుడ్ స్టార్‌పై ముకేశ్ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్‌ను సాధించాడు.
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్‌ను సాధించాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణించారు. ఇక డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’, ‘పుష్ప2’ సినిమాలతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. అసలు ‘పుష్ప 2’ సినిమాతో ఇండస్ట్రీలోనే కొత్త రికార్డులను బ్రేక్ చేశాడు. అయితే డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి అయితే అతన్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ క్రమంలో ముకేశ్ కన్నా కూడా ఐకాన్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు.
తాజాగా ‘పుష్ప-2’ సినిమాను చూసిన ముకేశ్ ఖన్నా.. యూట్యూబ్‌లో రివ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘శక్తిమాన్ సినిమా అంటూ వస్తే దానికి హీరోగా అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతారు. నేను ఆయన గత సినిమాలు చూడలేదు. ఈ మూవీ చూశాక అవి కూడా చూడాలనిపిస్తోంది. సినిమాని డబ్బుతో కాదు ప్లానింగ్‌తో తీయాలి. ఆ ప్లానింగ్ పుష్పలో సృష్టంగా కనిపిస్తోంది. కాకపోతే హీరో చట్టవిరుద్ధంగా ఉండటమే నాకు నచ్చలేదు’ అని పేర్కొన్నారు. కాగా ఒకప్పుడు శక్తిమాన్ పాత్రలో ముకేశ్ ఖన్నా అలరించిన సంగతి తెలిసిందే.