Mokshagna: మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ప్రశాంత్ వర్మతో కాదా? హాట్ టాపిక్‌గా రంగంలోకి మరో దర్శకుడు!
నందమూరి నటవంశం నుంచి తెలుగుతెరకు పరిచయం కాబోతున్న మరో వారసుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna).
దిశ, సినిమా: నందమూరి నటవంశం నుంచి తెలుగుతెరకు పరిచయం కాబోతున్న మరో వారసుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna). డ్యాన్సులు, నటనలో శిక్షణ పొంది సినిమాల్లోకి రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమైన నందమూరి మోక్షజ్ఞ నటించనున్న తొలిచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ (Hanuman) పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుని ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నందమూరి వారసుడి సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయాల్సిన ‘సింబా’ కొన్ని అనివార్య కారణాల చేత చివరి నిమిషంలో రద్దు అయిందట. ఈ క్రమంలోనే మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు మరో స్టార్ డైరెక్టర్ (star director) రంగంలోకి దిగాడు. ‘కల్కి 2898AD’తో వెయ్యి కోట్లకు పడగలెత్తిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాకుండా దీనిపై వచ్చే ఏడాదిలో అధికారిక ప్రకటన రావొచ్చని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. మోక్షజ్ఞ టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ప్రశాంత్ వర్మతో కాకుండా నాగ్ అశ్విన్‌తో కాబోతుందని వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది.