Rifle Club: తెలుగులోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

ఈ మధ్య కాలంలో మలయాళ (Malayalam) చిత్రాలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి.

Update: 2025-01-16 12:06 GMT
Rifle Club: తెలుగులోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో మలయాళ (Malayalam) చిత్రాలు తెలుగులో రిలీజై మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో చిత్రం తెలుగు డబ్బింగ్‌కు రెడీ అయింది. విజయ రాఘవన్ (Vijaya Raghavan), దిలీశ్ పోతన్ (Dileesh Potan), వాణీవిశ్వనాథ్ (Vanivishwanath), అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ (Malayalam action) థ్రిల్లర్ ‘రైఫిల్ క్లబ్’ (Rifle Club). డైరెక్టర్ ఆశిక్ బాబు (Ashik Babu) తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ (December) 19న కేరళ (Kerala)లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌(blockbuster hit)ను అందుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘రైఫిల్ క్లబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. ఈ రోజు (గురువారం)నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లు వసూలు రాబట్టిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.  

Tags:    

Similar News