‘BSS-12’ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. (పోస్ట్)
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘BSS-12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని.. మూన్ షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. అయితే శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండకి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ. ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మునపెన్నడూ చూడని అవతారంలో హీరోని చూస్తామని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆధారంగా అర్థమైపోయింది. కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా మేకర్స్ బెల్లకొండ శ్రీనివాస్‌కు సంబంధించిన మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు అతని పుట్టిన రోజు సందర్భంగా అతనికి విష్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను చూసినట్లయితే.. బండికి టార్చ్ లైట్ వేసుకుని బైక్ మీద కూర్చొని హీరో సీరియస్‌గా పర్వతం మీదకి జంప్ చేస్తున్నాడు. బ్యాక్ సైడ్‌లో మంటలతో పర్వతం వ్యాపించి మొత్తం పొగతో కమ్ముకున్నట్లుగా ఉంది.