సోషల్ మీడియాను మనం మంచి కోసం వాడదాం.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘ఖిలాడీ’, ‘హిట్: రెండవ కేసు’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా నటించింది. ఈ క్రమంలో మీనాక్షి చౌదరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో నెగెటివిటీ విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో ఆమె యూజర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. ఈ మేరకు ఓ వీడియో చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘నేను మీ మీనాక్షి చౌదరి.. సోషల్ మీడియా అనేది మన జనరేషన్‌కి ఒక వరం లాంటిది. ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌లో ఈ మధ్య నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. ఒక ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా..? అని ఒకసారి ఆలోచించండి. ఒక ఆడపిల్ల ఫొటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది అమ్మాయిని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి సీరియస్‌గా తీసుకోండి. సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడుదాం, చెడు కోసం కాదు.. చెడు పోస్ట్ చేయవద్దు’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.