Karthika Deepam : దీప జోలికి రావొద్దంటూ జ్యోకి వార్నింగ్ ఇచ్చిన దాసు
అక్కడే ఉన్న జ్యోకి మొత్తం అర్థమవుతూనే ఉంటుంది
దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దాసుతో మాట్లాడుతూ ‘ ముసలోడు చూస్తే మళ్లీ గొడవ గొడవ అవుతుంది.. ఇక్కడికి ఎందుకొచ్చావో అది చెప్పు ముందు ’ అని అంటుంది. నేను చెప్పను.. అలాగే ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లను.. అలా అని ఇక్కడే ఉండిపోను.. మీరు పొమ్మంటే అసలే పోను.. నాకు కూడా ఓ పని ఉంది. అది పూర్తయ్యే వరకూ ఇక్కడికి నేను వస్తూనే ఉంటాను’ అని దాసు గట్టిగా అరిచి చెబుతాడు. అయితే, అక్కడే ఉన్న జ్యోకి మొత్తం అర్థమవుతూనే ఉంటుంది. ‘ఇదిగో ఇది కూడా అంతే.. నీలాగే వాగుతూ ఉంటుంది’ అంటుంది అని పారు అంటుంది. ‘త్వరలోనే మీకన్నీ అర్థమవుతాయమ్మా.. దీప జ్యోలికి వెళ్లొద్దు .. అలాగే తొందరపడి ఏదీ కూడా చేయొద్దు.. జ్యోత్స్నా నీకే చెబుతున్నా.. విను ఆమె విషయాన్ని ఇక్కడితో వదిలెయ్’ అని కోపంగా చూపిస్తాడు.
‘ఏంట్రా నన్ను కూడా బెదిరిస్తున్నావా? ఏదో కొడుకువి కదా అని వదిలేస్తున్నా’ అని పారు అంటుంది. ‘హూ.. ఎవరు కొడుకు.. ఎవరు కూతురు..’ అంటూ మళ్లీ పారుకి అర్థం కాకుండా దాసు మాట్లాడుతూనే ఉంటాడు. ' అసలు నీలాంటి వాళ్ళు ఇక్కడ కాదు రా హాస్పిటల్లో ఉండాలి పోరా పో..’ అని దాసుని పంపించేస్తుంది. ‘వాడు మాటలు నువ్వేమి పట్టించుకోకు... అలానే వాగుతాడులే అని జ్యోతో అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.
Read More...
Brahmamudi : ఇంట్లో వాళ్ళ మీద ఫైర్ అయిన రుద్రాణీ