'నేను ఏసీ వ్యాన్‌లో నిద్రపోతే.. రజనీ నేలపై పడుకున్నారు'.. సూపర్ స్టార్‌పై అమితాబ్ ప్రశంసల వెల్లువ

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-23 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో ఈయన కూడా ఒకరు. కానీ, నిజ జీవితంలో చాలా సాధారణ లైఫ్‌ను గడుపుతారు. బస్ కండెక్టర్(Bus conductor) నుంచి నేడు సూపర్ స్టార్‌గా ఎదగడం అంటే మాటల్లో చెప్పలేని విజయం అనే చెప్పుకోవాలి. అంతేకాదండోయ్ మారువేషం దాచుకుని, బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అతని సింప్లిసిటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ నేపథ్యంలో స్టార్ హీరో, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

స్టార్ డమ్ వచ్చిన తొలినాళ్ళలో రజనీకాంత్(Rajinikanth) తమిళంలోనే కాకుండా కన్నడ, తెలుగు, కొన్ని హిందీ వంటి భాషా చిత్రాల్లో కూడా నటించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం రజనీకాంత్ తనతో కలిసి హిందీ మూవీస్‌లో నటించినప్పుడు ఎలా ఉండేవారో అమితాబ్ బచ్చన్ వివరించారు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన తాజా చిత్రం 'వెట్టయాన్'(Vettaiyan). దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈ దిగ్గజ నటులు మళ్లీ కలిసి నటిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే 'వెట్టయాన్‌' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్(Amitabh bachchan) హాజరు కాలేదు కానీ తన వాయిస్ నోట్ పంపారు. ఇది షో లో ప్లే చేశారు..

అందులో రజనీకాంత్ గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. 'హమ్ సినిమా(hum Movie) షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రజనీకాంత్ బ్రేక్ టైం లో నేలపై పడుకునేవారు. నేను మాత్రం నా ఏసీ వాహనంలో పడుకునేవాడిని. అయితే రజనీకాంత్ నేలపై పడుకోవడం చూసి నేను ఏసీ వాహనం నుంచి బయటకు వచ్చాను. రజనీకాంత్ స్టార్స్ అందరికంటే సుప్రీమ్ స్టార్(Supreme Star)' అంటూ అమితాబ్.. సూపర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించారు. కాగా వెట్టయాన్ అమితాబ్ మొదటి తమిళ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Similar News