Chiranjeevi: అనారోగ్యంతో బాధపడుతున్న మెగాస్టార్.. GET WELL SOON అంటూ అభిమానుల ట్వీట్స్
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన ఈవెంట్‌లో పద్మ భూషణ్, మెగాస్టార్ చిరంజీవి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన ఈవెంట్‌లో పద్మ భూషణ్, మెగాస్టార్ చిరంజీవి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ నటించేందుకు, మెట్లు ఎక్కేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. దీనిపై యాంకర్ స్పందిస్తూ.. ‘చిరంజీవి గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరు సార్‌ను ఈ సిట్యువేషన్‌లో పిలవాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిరు తొందరగా కోలుకోవాలని GET WELL SOON అంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ.. 156 చిత్రాలు, 537 సాంగ్స్, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు గానూ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్‌లో స్థానం దక్కింది.