‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్.. హాట్ విజువల్స్‌తో ఆర్జీవీ మార్క్..

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిర్మాణంలో గిరి కృష్ణ కమల్(Giri Krishna Kamal) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ శారీ(Saaree).

Update: 2024-09-22 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిర్మాణంలో గిరి కృష్ణ కమల్(Giri Krishna Kamal) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ శారీ(Saree). ఇక ఆరాధ్య దేవి(Aaradhya Devi), సత్య యదు(Sathya Dayu) ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమాపై భారీ అంచనాలే పెంచుకున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఐ వాంట్ లవ్ ఫర్ ఎవర్ అంటూ సాగే ఈ సాంగ్‌లో ఆరాధ్య దేవిని మరింత అందంగా చూపిస్తూ.. అడవుల్లో, జలపాతం వద్ద ఈ సాంగ్ షూట్ చేసారు. ఈ పాటని సిరాశ్రీ(Sirasri) రాయగా DSR బాలాజీ సంగీత దర్శకత్వంలో కీర్తన శేష్ పాడింది. ప్రస్తుతం ఈ హాట్ సాంగ్ వైరల్ గా మారింది. కాగా ఈ సాంగ్‌తోనే ఆర్జీవీ.. ఆర్జీవీ డెన్ అనే కొత్త మ్యూజిక్ ఛానల్‌ని కూడా మొదలుపెట్టాడు. ఇకపై తన సినిమాల సాంగ్స్ అన్ని ఈ మ్యూజిక్ ఛానల్‌లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Full View

(video link credits to RGV DEN MUSIC you tube channel)


Similar News