పిల్లలతో క్యూట్ రీల్ చేసిన అల్లు స్నేహ రెడ్డి.. నెట్టింట ఆకట్టుకుంటోన్న వీడియో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-23 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భార్య అల్లు స్నేహ రెడ్డి(Allu Sneha Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పిల్లలు, ఫ్యామిలీకి చెందిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే బన్నీ ఫ్యాన్స్ స్నేహారెడ్డిని కూడా కచ్చితంగా ఫాలో అవుతూ వీటిపై స్పందిస్తూ ఉంటారు. ఇక అర్హ(Arha), అయాన్(Ayaan) క్యూట్ ఫొటోలు, వీడియోలు స్నేహ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం అవి సెకన్లలో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో వీరి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

తాజాగా అల్లు స్నేహారెడ్డి, అయాన్, అర్హ ముగ్గురు కలిసి ఒక క్యూట్ రీల్ చేశారు. అందులో ముగ్గురు మూడు ఫోన్‌లో తలో వైపు నిల్చొని వీడియో తీశారు. ఆ మూడు వీడియోలను కలుపుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘ఎవరు ఎవర్ని చూస్తున్నారు’(Who’s watching who?) అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీటిని చూసిన నెటిజన్లు.. క్యూట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ రీల్‌ను చూసేయండి..

(video link credits to allu sneha reddy instagram id)


Similar News