Urfi Javed: ఇంతలా అవమానిస్తే అస్సలు ఊరుకోను.. ఉర్ఫీ జావెద్ ఫైర్ (పోస్ట్)
బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు దన వెరైటీ డ్రెస్‌లతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు దన వెరైటీ డ్రెస్‌లతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా అన్ని రకాల బట్టలు క్రియేట్ చేసి మరీ ఫ్యాషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన స్టైలీష్ డ్రెస్‌లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే పలు షోస్‌కు కూడా గెస్ట్‌గా వెళ్తూ సందడి చేస్తోంది. ఇటీవల ఉర్ఫీ ‘ఇండియాస్ గాట్ టాలెంట్’(India's Got Latent) అనే షోకు వెళ్లింది. అయితే అక్కడ కొంతమంది ఆమెపై అసభ్యకర కామెంట్లు చేయడంతో మధ్యలోనే వెళ్లిపోయింది.
తాజాగా, ఈ విషయంపై ఉర్ఫీ సోషల్ మీడియా(Social Media) ద్వారా స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ నోట్ షేర్ చేసింది. ‘‘వ్యూస్ రాబట్టేందుకు ఇతరులపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఈ రోజుల్లో సామాన్యమైపోయింది. కానీ నన్ను అవమానిస్తుంటే, వేధిస్తుంటే అవకాశాల కోసం కొంతమందితో ఉన్నానని ఏవేవో లెక్కలు వేస్తుంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇదంతా చేసేది.. క్షణాల్లో ఫేమస్ అవడానికేనా?. ఓ షోకు వెళ్లినప్పుడు స్టేజీపై ఓ వ్యక్తిని ఎందుకు వికలాంగుడిగా నటిస్తున్నావని అడిగాను.
అందుకు అతను అందరి ముందుకు నాపై దుర్భాషలాడాడు. కోపంతో పిచ్చిగా ఏదేదో వాగాడు. నన్ను మియా కలీఫాతో పోల్చుతూ పతివ్రత అని అవమానిస్తూ నా శరీర గణనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నాకు అప్పుడు అసహ్యం వేసింది. అందుకే అక్కడి నుంచి ఏం అనకుండా వెళ్లిపోయాను. అయితే ఈ సంఘటనకు సమ్ రైనా(Sam Raina)కు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే.. అతను నాకు మంచి ఫ్రెండ్. నేను నా స్నేహితుడిని ఏమీ అనట్లేను. కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్(Contestants) గురించే మాట్లాడుతున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఉర్ఫీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.