HAPPY NEW YEAR: కొత్త సంవత్సరం వేళ కాబోయే భార్యతో ఫొటో పంచుకున్న అక్కినేని అఖిల్

సిసింద్రీ(Sisindri) సినిమాలో బాలనటుడిగా నటించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు అక్కినేని అఖిల్.

Update: 2025-01-01 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిసింద్రీ(Sisindri) సినిమాలో బాలనటుడిగా నటించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు అక్కినేని అఖిల్. తర్వాత ఈ హీరో మనం, అఖిల్, ఆటాడుకుందాంరా, హలో, మిస్టర్ మజ్ను(Mr. Majnu), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్(Most Eligible Bachelor), ఏజెంట్ వంటి సినిమాల్లో నటించారు. కానీ ఇందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే ఈ హీరో ఇటీవలే జైనాబ్ రావ్‌జీ(Zainab Raoji) తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం హైదరాబాదులో నాగార్జున ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. అఖిల్ అండ్ జుల్ఫీ రావ్ జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ జైనబ్ ఎంగేజ్‌మెంట్‌కు తక్కువ మంది హాజరైనట్లు సమాచారం.

యువ జంటను ఆశీర్వదించండి అంటూ నాగార్జున()Nagarjuna అండ్ అమల(Amala) సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజాగా అఖిల్ నేడు కొత్త సంవత్సరం వేళ కాబోయే భార్యతో ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ ఫొటో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోకు హ్యపీ న్యూయర్ అని ఓ లవ్ సింబల్ జోడించి క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ ధరించి అభిమానులతో పంచుకున్న వీరి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలోని జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 



 


Tags:    

Similar News