Megastar Chiranjeevi: ‘భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి’: మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజెంట్ చిరంజీవి విశ్వంభర(Viśvambhara) చిత్రంలో నటిస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం వేళ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన అభిమనానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ బై బై 2024 & స్వాగతం 2025.. కొత్త సంవత్సరం మనందరికీ కొత్త ఆశలు, ఆకాంక్షలు, జీవితం & కెరీర్ లక్ష్యాలు అలాగే వాటన్నింటిని సాకారం చేసుకునేందుకు డ్రైవ్ & ఎనర్జీని అందించాలి. భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరమంతా ప్రేమ, నవ్వు.. కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకోండి’ అంటూ అభిమానులకు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.