‘ఆమెతో నాకు సినిమా చేసే ఉద్దేశం లేదు’.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంతో మంది అమ్మాయిలు లైఫ్ ఇచ్చారు.
దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంతో మంది అమ్మాయిలు లైఫ్ ఇచ్చారు. అలాగే కొన్ని సార్లు సటైరికల్ కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈయన ‘శారీ’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఓ అమ్మాయి చీరలో ఉన్నప్పుడు ఆమె అందానికి ఫిదా అయ్యి ఆర్జీవీ ఏకంగా ఆమెతో ఈ సినిమానే చేస్తున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ తనని అభిమానిస్తున్నాని చాలా సందర్భాల్లో అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ జాన్వీ కపూర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “‘పదహారేళ్ల వయసు’ లేదా ‘వసంత కోకిల’.. సినిమా ఏదైనా సరే శ్రీదేవి యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్‌ననే విషయమే మర్చిపోయా. ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి” అని చెప్పారు. అప్పుడు యాంకర్ జాన్వీ కపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా..? అని ప్రశ్నించగా.. దానికి ఆర్జీవీ స్పందిస్తూ.. “నాకు శ్రీదేవి అంటే ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా.
ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే, జాన్వీతోనూ నేను సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తంగ క్యారెక్టర్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ సరసన ‘RC-16’ మూవీలో నటిస్తోంది.