‘తొందరపడి పెళ్లి చేసుకున్నాను, కానీ సెట్ అవ్వలేదు’.. డివోర్స్ పై కమిటీ కుర్రోళ్లు నటుడు సంచలన కామెంట్స్

తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-12-18 04:02 GMT

దిశ, సినిమా: తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న యూట్యూబర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈయన.. ‘మా విడాకులు’ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సిరీస్‌లో ప్రసాద్ డైలాగ్స్, పంచ్ లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ ఒక్కసారిగా స్టార్ యూట్యూబర్‌గా మారాడు. ‘మా విడాకులు’ తరువాత ‘పెళ్లి వారమండీ’ అనే సిరీస్‌ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు సీజన్స్ రిలీజ్ చేశారు. మూడు సీజన్స్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక వెబ్ సిరీస్ వలన వచ్చిన ఫేమ్‌తో మెగా డాటర్ నిహారిక.. ప్రసాద్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్దోడుగా ప్రసాద్ నటనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లో కూడా అందరిచేత కంటతడి పెట్టించాడు. అలా నవ్వించే ప్రసాద్ బెహరా జీవితంలోనూ చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ విషయాలను పంచుకుంటూ రీసెంట్‌గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసాద్ తన విడాకులకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. "తొందరపడి పెళ్లి చేసుకున్నాను. మేము విడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు. నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఆ అమ్మాయే ముందు రియలైజ్ అయ్యింది. నెమ్మదిగా నాకు అర్థమయ్యింది. నాకు ఆ లవ్ అది ఉండడంతో నేను కొద్దిగా లేట్‌గా రియలైజ్ అయ్యాను. ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. మేము విడిపోయి రెండేళ్లు అవుతుంది. విడాకులు మాత్రం రీసెంట్‌గా వచ్చాయి.

సక్సెస్ వచ్చినప్పుడు పెయిన్ చాలా ఉంటుంది. అది తట్టుకుంటేనే దాన్ని చూడగలము. నేను నా బాధను తట్టుకోవడానికి ఖాళీ లేకుండా పని చేస్తున్నా. ఎవరు చనిపోయినా.. ఎవరు పెళ్లి చేసుకుంటున్నా.. ? వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాను. అంతగా పని బిజీలో పడిపోయాను" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ప్రసాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు జాను నారాయణ. ఆమె కూడా నటినే. వీరిద్దరూ కలిసి కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేశారు. దీంతో ఒకరి మధ్య మరొకరికి ప్రేమ చిగురించింది. అలా రెండేళ్లు రిలేషన్‌లో ఉండి.. పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లి తర్వాత విభేదాల వల్ల కొన్ని నెలలకే విడిపోయారు.

Tags:    

Similar News