Jack: హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘జాక్’ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి సాలీడ్ అప్డేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృదం. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురాబోతున్నట్లు ఈ పోస్టర్ ఆధారంగా మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో అభిమానుల్లో ఈ చిత్రం పైభారీ అంచనాలు నెలకొన్నాయి.