Director Atlee: ‘ఎవరి ఊహాలకు అందనివిధంగా ఉంటుంది’.. తదుపరి చిత్రంపై భారీ హైప్ పెంచుతోన్నఅట్లీ కామెంట్స్
టాలెంటెడ్ దర్శకుడు అట్లీ(Director Atlee) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ దర్శకుడు అట్లీ(Director Atlee) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) హీరోగా జవాన్(Jawan) చిత్రాన్ని తెరకెక్కించి.. రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో అట్లీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే తాజాగా అట్లీ.. బేబీ జాన్(Baby John) ప్రమోషన్‌లో భాగంగా తన తదుపతి చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. నెక్ట్స్ తను రూపొందించే సినిమా స్క్కిప్ట్ పనులు దాదాపు కంప్లీట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఎవరు ఊహించని నటీనటుల్ని మీ ముందుకు తీసుకొస్తానని పేర్కొన్నారు. నటీనటుల్ని చూసి కచ్చితంగా షాక్ అవుతారని వెల్లడించారు. ఎవరి ఊహలకు అందని విధంగా, దేశం గర్వించేలా తన నెక్ట్స్ చిత్రం ఉండనుందని అట్లీ చెప్పుకొచ్చారు. త్వరలోనే క్యాస్టింగ్ ప్రకటనతో సర్‌ప్రైజ్ చేస్తానని వెల్లడించారు. అభిమానుల ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. త్వరలోనే తర్వాత ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తానని అట్లీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.