Superstar: 2024 లో ఏకంగా 10 దేశాలు తిరిగిన స్టార్ హీరో ఫ్యామిలీ.. ఏఏ దేశాలంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) అండ్ నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) అండ్ నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరిద్దరు సినిమాల్లో నటించే క్రమంలో ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో సింపుల్‌గా వివాహం జరుపుకున్నారు. వీరికి ప్రేమకు చిహ్నంగా గౌతమ్(Gautham) అండ్ సితార(Sitara) జన్మించారు. సూపర్ స్టార్ పిల్లలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంటారు. ప్రత్యేకంగా సితార ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈ ఏజ్‌లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు హీరోయిన్ లెవల్‌లో ఇస్టాలో ఫాలోవర్లు ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే..
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ సమయం దొరికితే చాలు.. విదేశాలకు చెక్కేస్తారు. నమ్రత అండ్ తమ పిల్లలు టూర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా నమ్రత 2024 లో ఏఏ వెకేషన్స్ కు వెళ్లారో, వాటి పేర్లు.. ఆ లొకేషన్‌లో దిగిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొనాకో(Monaco), ఇంగ్లాండ్(England) లోని లండన్(London), అమెరికా(America)లోని న్యూయార్క్(New York), ఇటలీలోని పోర్టోఫినో, మాల్దీవ్స్(Maldives), దుబాయ్(Dubai), స్విట్జర్లాండ్(Switzerland) లోని జెనీవా(),థాయిలాండ్(Thailand)లోని బ్యాంకాక్(Bangkok), జర్మనీ(Germany)లోని బాడెన్(Baden), ఎస్టీ మోరిట్జ్, భారతదేశంలోని జైపూర్(Jaipur), ముంబయి(Mumbai).. ఇలా ఏకంగా పది దేశాలకు టూర్ వెళ్లినట్లు నమ్రత పోస్ట్ లో రాసుకొచ్చింది.