హీరోయిన్ బర్త్ డే స్పెషల్.. ‘జాక్’ నుంచి మెస్మరైజింగ్ లుక్ షేర్ చేసిన మేకర్స్

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డిజే టిల్లు’ సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెంచుకున్నాడు.

Update: 2025-01-04 06:59 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ‘డిజే టిల్లు’ సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెంచుకున్నాడు. ఇక గత ఏడాది దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’(Tillu Square) కూడా మంచి రెస్పాన్స్‌కు దక్కించుకుంది. ప్రస్తుతం సిద్దు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయన మూడు చిత్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ‘జాక్’(Jack). దీనిని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండగా.. SVCC బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి 2024లో అధికారిక ప్రకటన వచ్చింది.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ ‘జాక్’ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఇటీవల సిద్దు జొన్నలగడ్డ ఫస్ట్ లుక్ విడుదల చేసి క్యూరియాసిటీని పెంచారు. తాజాగా, జాక్ మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) పుట్టినరోజు సందర్భంగా మెస్మరైజింగ్ లుక్‌(Mesmerizing look)ను విడుదల చేసి అందరినీ ఫిదా చేశారు. ఇందులో ఆమె చుడిదార్ ధరించి చున్నీని అడ్డుగా పెట్టుకుని కాటుక కళ్లతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఇక అది చూసిన నెటిజన్లు వావ్ సింప్లీ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు.

Tags:    

Similar News