సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరో నారా రోహిత్‌కు కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్

నారా రోహిత్, సిరి లెల్లా అక్టోబర్ 13న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ‘ప్రతినిధి-2’ సినిమాలో జంటగా నటించి ప్రేమలో పడ్డారు.

Update: 2024-10-14 16:23 GMT

దిశ, సినిమా: నారా రోహిత్, సిరి లెల్లా అక్టోబర్ 13న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ‘ప్రతినిధి-2’ సినిమాలో జంటగా నటించి ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వీరి ప్రేమ వివాహానికి వారు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నారా రోహిత్‌కు కాబోయే భార్య సిరి గురించి వార్తలు కనిపిస్తున్నాయి. ఫొటోలతో పాటు ఆమెకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అసలు సిరి ఎవరు, ఎక్కడ చదువుకుంది? ఆమె ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలు తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా, పలు విషయాలు బయటకు వచ్చాయి. అసలు నారా వారింటికి కోడలిగా వెళ్లబోతున్న సిరి గురించి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సిరి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని దైద గ్రామానికి చెందిన యువతి. కొన్ని కారణాల వల్ల ఆమె కుటుంబం రెంటచింతలకు వలస వెళ్లినట్లు సమాచారం. అయితే సిరికి ముగ్గురు అక్కలు ఉన్నారు. పెద్ద అక్క శ్రీలక్ష్మి అంగన్వాడీ సూపవైజర్‌గా పని చేస్తోంది. అలాగే రెండో అక్క భవానీ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వగా.. మూడో అక్క ప్రియాంక వివాహం చేసుకుని హైదరాబాద్‌లో ఉంటుంది. అయితే సిరి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి గృహిణిగా ఉండి ఇంటి బాధ్యతలు చూసుకుంది. ఇక సిరి విషయానికొస్తే హైదరాబాద్‌లో చదువుకున్న ఆమె మాస్టర్స్‌కు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ మోడల్‌గా పరిచయం అయింది. అలాగే సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేయడంతో పాటు షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక నారా రోహిత్‌తో ప్రతినిధి-2లో నటించి ఏకంగా ఆయనకు భార్యగా నారా ఇంటికి వెళ్లబోతుంది. వివాహ బంధంతో సిరికి స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ దక్కిందనడంతో అతిశయోక్తి లేదు. ప్రజెంట్ ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కాగా, నారా రోహిత్ తన ప్రేయసి గురించి ముందుగా తన పెద్దమ్మ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరికి చెప్పారట. ఆమెకు సిరి నచ్చడంతో వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి ఓకే చెప్పారట. దీంతో ఈ యువజంటకు అక్టోబర్ 13న నిశ్చితార్థం అయింది. ఈ ఏడాది డిసెంబర్‌లో నారా రోహిత్- సిరి పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు నారా వారి ఇంటి టాక్. సిరి తన మొదటి సినిమా హీరోతో ప్రేమలో పడి పెళ్లిపీటలు ఎక్కడం యాదృచ్ఛికమే.

Full View


Similar News