రూమర్స్ కు చెక్ పెట్టిన నాగచైతన్య టీం

టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaithanya)పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది ఆయన టీం.

Update: 2024-10-14 16:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaithanya)పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది ఆయన టీం. నాగచైతన్య న్యూ వెబ్ సిరీస్ కి సంతకం చేశాడని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుందని నెట్టింట్లో పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ వార్తలపై నాగచైతన్య టీం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య 'తండేల్' సినిమా మీద మాత్రమే దృష్టి పెట్టారని క్లారిటీ ఇచ్చింది. నాగ చైతన్య నటించిన 'దూత' వెబ్ సిరీస్ ప్రేకక్షకుల మన్ననలు అందుకుంది. ఈ హిట్ ను దృష్టిలో పెట్టుకొని మరో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తుండగా.. చైతూ టీం క్లారిటీ ఇచ్చింది. కాగా చందూ మొండేటి దర్శకత్వంలో మత్స్యకారుల జీవిత నేపథ్యంలో రూపొందుతున్న 'తండేల్' సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.


Similar News