Vijay-69: ఓటీటీలోకి ‘విజయ్-69’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఇటీవల కాలంలో పలు కొత్త సినిమాలన్నీ ఓటీటీలోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
దిశ, సినిమా: ఇటీవల కాలంలో పలు కొత్త సినిమాలన్నీ ఓటీటీలోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విడుదలైన 15 రోజులకే కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని మాత్రం కొన్ని నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చి ఊహించని విధంగా హిట్ అవుతున్నాయి. తాజాగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన ‘విజయ్ 69’ (Vijay-69) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్(streaming) కు రెడీ అయింది. అయితే ఓ క్రీడాకారుడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అక్షయ్ రాయ్ తెరకెక్కించారు. యశ్‌రాజ్ ఫిల్మ్ బ్యానర్‌పై మనీశ్ నిర్మించారు. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. నవంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ (streaming) కానున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల అయింది.