Kaalamega Karigindi: దరీ దాటిన మోహం దేహమే కదా.. ఆకట్టుకుంటోన్న ఫీల్ గుడ్ లవ్ సాంగ్

దిశ, సినిమా: వినయ్ కుమార్ (Vinay Kumar), శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ (Latest Movie) ‘కాలమేగా కరిగింది’ (Kaalamega Karigindi). శింగర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీ(Poetic Love Story)గా రూపొందిన ఈ మూవీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ‘దరీ దాటిన మోహం..’ రిలీజ్ చేశారు.
డైరెక్టర్ శింగర మోహన్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్ (Music director Gudappan) మంచి ట్యూన్ అందించారు. సింగర్స్ సాయి మాధవ్, ఐశ్వర్య దరూరి ఆకట్టుకునేలా పాడారు. ‘దరీ దాటిన మోహం దేహమే కదా.. ఎదుటే నిలిచేనూ, ఆ యదపై తాకేనూ, చెలీ వీడినా మౌనం, మర్మమే కదా, కథలై కదిలేనూ, ఆ కబురై పాకేనూ..’ అంటూ లవ్ ఫీల్‌తో సాగుతోన్న ఈ సాంగ్ మ్యూజికల్‌గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ‘తను జతగా..’, ‘ఊహలోన ఊసులాడే..’ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్(Music Lovers)ను ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ పాట కూడా వైరల్ అవుతోంది.