సీక్రెట్ రిలేషన్‌షిప్.. పెళ్లికి రెడీ అయిన డింపుల్ హయాతి.. వరుడు ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీలో ఐటెం సాంగ్‌లో ఆడిపాడి కుర్రకారును ఓ ఉపు ఊపేసింది.

Update: 2024-07-06 09:16 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీలో ఐటెం సాంగ్‌లో ఆడిపాడి కుర్రకారును ఓ ఉపు ఊపేసింది. ఈ సాంగ్‌ బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్‌కు దక్కించుకోవడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత హయాతీ రామబాణం, కిలాడి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిం మెప్పించింది. అప్పట్లో ఓ పోలీస్ ఆఫీసర్‌తో గొడవపడి దేశవ్యాప్తంగా డింపుల్ హయాతి సంచలనం సృష్టించింది. తన మాట తీరుతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత నుంచి సినిమాలకు కాస్త దూరం అయిందనే చెప్పాలి.

కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోషూట్లు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, డింపుల్ హయాతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సీక్రెట్ రిలేషన్ మెయింటేన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తతో ఈ అమ్మడు ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు పెద్దలను కూడా ఒప్పించి తొందరలోనే ఓ ఇంటి కోడలు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్తల వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ డింపుల్ హయాతి పెళ్లి వార్తలు చూసి ఫ్యాన్స్ అలాంటిది ఏదైనా ఉంటే తనే ప్రకటిస్తుందిగా అని ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.


Similar News