Ram Charan: కుమార్తె క్లింకార ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్.. బొమ్మపై కూర్చుని ఎంత క్యూట్‌గా ఉందో??

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా మెగా ప్రిన్సెస్ క్లింకార ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో తన అభిమానులతో పంచుకున్నారు.

Update: 2024-09-30 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా మెగా ప్రిన్సెస్ క్లింకార ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో తన అభిమానులతో పంచుకున్నారు. యల్లో అండ్ పింక్ గుర్రపు బొమ్మపై ముద్దుగా కూర్చున్న క్లింకార.. రామ్ చరణ్ ముక్కుపై చేయి పెట్టి నాన్నతో ఆటలు ఆడుతోంది. నేల మీద కాళ్లపై కూర్చుని కుమార్తెతో సమయాన్ని కేటాయిస్తూ గ్లోబల్ స్టార్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ పిక్‌లో క్లింకార ఫేస్ సైడ్ నుంచి కాస్త క్లియర్‌గా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని డేస్ ఉపాసన, రామ్ చరణ్.. ఏ ఈవెంట్, ఫెస్టివల్ ఫొటోలు పంచుకున్న మెగా ప్రిన్సెస్ ఫేస్ ఎమోజీలతో కవర్ చేసేవారు. ప్రజెంట్ ఈ బుజ్జాయి, రామ్ చరణ్ సరదాగా ఆడుకుంటోన్న పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సో క్యూట్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పైగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పోస్ట్‌కు లవ్ సింబల్ జోడించడం మరింత ఆకట్టుకుంటోంది. కానీ ఈ పిక్ క్లింకారదా? లేక చరణ్  సిస్టర్ వాళ్ల కుమార్తెనా? అంటూ పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


Similar News