Anushka- Prabhas: అనుష్క ప్రభాస్‌ను ఏమని పిలుస్తుందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ అనుష్క వివాహం చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ అనుష్క వివాహం చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే అనుష్క ఓ వ్యాపారవేత్తను వివాహమాడబోతుందంటూ నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇక ప్రభాస్-అనుష్క ఫ్రెండ్షిష్ గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి మూడు చిత్రాల్లో కలిసి నటించడం విశేషం. బిల్లా మూవీతో వీరి జర్నీ ప్రారంభమైంది. తర్వాత మిర్చి, బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి అండ్ బాహుబలి-2 లో కూడా అద్భుతంగా నటించారు. వీరి కెమిస్ట్రీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో రెబల్ స్టార్, స్వీటీ పెళ్లి చేసుకున్నారు.. ఓ బాబుకు కూడా జన్మనిచ్చారంటూ ఓ ఫొటో క్రియేట్ చేసి అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేశారు.
ఇకపోతే అనుష్క.. పాన్ ఇండియా స్టార్ ను అందరిముందు బాహుబలి షూటింగ్ సమయంలో సెట్ లో టీజింగ్ చేస్తూ ఏడిపించేసిందట. ఒకవేళ ప్రభాస్ కనిపించకపోతే నా కొడుకు, నా బాబు ఎక్కడ అని అడిగేదట. దీంతో ప్రభాస్ ఓసారి తలపట్టుకున్నాడట. ఇలా సెట్ లో ఫన్నీగా రెబల్ స్టార్ ను ఆటపట్టిస్తూ ఏడిపించిన విషయం గతంలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం అనుష్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాహుబలి పార్ట్-2 లో అనుష్కకు కొడుకుగా మహేంద్ర బాహుబలి రోల్ లో నటించిన విషయం తెలిసిందే.