Oscar : 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా ఇదే.. ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకున్న ఆ మూవీ!

Update: 2025-03-03 11:14 GMT
Oscar : 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా ఇదే.. ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకున్న ఆ మూవీ!
  • whatsapp icon

దిశ, సినిమా: 97వ అకాడమీ అవార్డ్‌లు ప్రకటన కార్యక్రమం ఎట్టకేలకు లాస్ ఏంజిల్స్‌(Los Angeles)లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌‌(Iconic Dolby Theater)లో ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో హాలీవుడ్ టాప్ నటీనటుల(Hollywood's top actors)తో పాలు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. అంతే కాకుండా.. రెడ్ కార్పెట్‌పై సరికొత్త ట్రెండీ దుస్తుల్లో వారందరూ మెరిశారు. ఈ 97వ అకాడమీ అవార్డుల వేడుకలో అమెరికాకు చెందిన ‘అనోరా’ (Anora) చిత్రం ప్రభంజనం సృష్టించింది. వేరు వేరు కేటగిరీస్‌లో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇక 2025 ఆస్కార్ విజేతలు (Oscar winners) లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం..

  1. ఉత్తమ చిత్రం- అనోరా (Anora)
  2. ఉత్తమ నటుడు- అడ్రియన్ నికోలస్ బ్రాడీ (Adrien Nicholas Brady)(ది బ్రూటలిస్ట్)
  3. ఉత్తమ నటి- మైకేలా మాడిసన్ రోస్‌బర్గ్ (Mikaela Madison Rosberg)(అనోరా)
  4. ఉత్తమ దర్శకుడు- సీన్ బేకర్(Sean Baker) (అనోరా)
  5. ఉత్తమ సహాయ నటుడు- కీరన్ కల్కిన్ (Kieran Culkin) (ఏ రియల్ పెయిన్)
  6. ఉత్తమ సహాయ నటి- జోసల్దానా (Josaldana)(ఎమీలియా పెరెజ్)
  7. ఉత్తమ సినిమాట్రోగ్రఫీ- లాల్ క్రాలే (Lol crawl) (ది బ్రూటలిస్ట్)
  8. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- పీటర్ స్ట్రౌగన్ (Peter Straughan) (కాన్‌క్లేన్)
  9. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- సీన్ బేకర్ (Sean Baker) (అనోరా)
  10. ఉత్తమ కాస్టూమ్య్ డిజైన్- పాల్ టాజ్‌వెల్ (Paul Tazewell) (విక్‌డ్)
  11. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్- ఫ్లో (Flow)
  12. ఉత్తమ యానిమేటడ్ షార్ట్ ఫిలిమ్- ఇన్ ద షాడో ఆఫ్ ద సైప్రెస్ (In the Shadow of the Cypress)
  13. ఉత్తమ మేకప్, హెయిర్ స్టైల్- ది సబ్‌స్టాన్స్ (The Substance)
  14. ఉత్తమ ఎడిటింగ్- సీన్ బేకర్ (Sean Baker)(అనోరా)
  15. ఉత్తమ ఒరిజినల్ సాంగ్- ఎల్ మాల్ (El Mall) (ఎమిలియా పెరెజ్)
  16. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- నాథన్ క్రౌలీ, లీ శాండల్స్ (Nathan Crowley, Lee Sandals) (విక్‌డ్)
  17. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్- నో అదర్ ల్యాండ్ (No Other Land)
  18. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (The Only Girl in the Orchestra)
  19. ఉత్తమ సౌండ్- డ్యూన్ పార్ట్2 (Dune Part 2)
  20. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- డ్యూన్ పార్ట్2 (Dune Part 2)
  21. ఉత్తమ లైన్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్- ఐ యామ్ నాట్ ఎ రోబోట్ (I am not a robot)
  22. బెస్ట్ ఒరిజినల్ స్కోర్- డేనియల్ బ్లమ్‌బెర్గ్ (Daniel Blumberg) (ది బ్రూటలిస్ట్)
Tags:    

Similar News