Game Changer: రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగబోతున్న చిరంజీవి, పవన్ కల్యాణ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా " గేమ్‌ ఛేంజర్‌ "

Update: 2024-12-31 02:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా " గేమ్‌ ఛేంజర్‌ " (Game Changer). సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ స్పీడ్ అందుకున్నాయి. మరో పది రోజుల్లో మన ముందుకు గేమ్‌ ఛేంజర్‌ రాబోతుండటంతో ఓ రేంజ్‌లో ఈవెంట్స్ చేస్తోంది. శంకర్‌ దర్శకత్వం వహించినా ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. జనవరి 10న ఆడియెన్స్ ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే విజయవాడలో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన 256 అడుగుల రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌ను ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆవిష్కరించారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వటంతో చిత్ర బృందం ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో గేమ్‌ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

2025 కొత్త సంవత్సరం జనవరి 1 వ తేదీన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అనంతరం నిర్మాత దిల్‌రాజు గేమ్‌ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఇన్వైట్ చేసినట్లు తెలిసిన సమాచారం. అయితే, జనవరి 1న హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) చేతుల మీదుగా గేమ్‌ఛేంజర్‌ ట్రైలర్ రిలీజ్ చేయించాలని చూస్తున్నారట. ఇక, ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌ ( Pawan Kalyan) గెస్ట్‌గా రాబోతున్నారని తెలిసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News