Game Changer: విడుదలకు ముందే రికార్డు క్రియోట్ చేసిన 'గేమ్ ఛేంజర్'.. ఆ కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : రామ్ చరణ్ హీరోగా ( Ram Charan ) " గేమ్ ఛేంజర్ " ( Game Changer)మూవీ జనవరి 10 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం, ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. గత రెండు రోజుల నుంచి రామ్ చరణ్ ముంబైలోనే ఉంటూ.. ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే, ఈ మూవీలో పాటలకి శంకర్ దగ్గరుండి కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కో పాటను ఒక్కో స్టైల్లో డిజైన్ చేశారు. ఇంత వరకు ఈ సినిమాలో లేని విధంగా పాటల కోసమే రూ.75 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక్కడే తెలుస్తుంది రేపు సినిమాలో పాటలు ఎలా ఆకట్టుబోతున్నాయో అని! శంకర్ ఆలోచనలు పట్టుకోవడం అంత సులువు కాదు. ఆయన ఏది ప్లాన్ చేసిన చాలా కొత్తగా చేస్తారు. ఇప్పటిదాకా ఎవరూ వాడని టెక్నాలజీని ఉపయోగించి 'నానా హైరానా' పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారట. ఆ కెమెరాతో ఇప్పటి వరకు ఇండియాలో ఎలాంటి పాటలు షూట్ చేయలేదు. ఫస్ట్ ఇండియన్ సాంగ్ గా రామ్ చరణ్ ది అవ్వడం విశేషం. 'ఇండియన్ 2' బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వడంతో గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు.