Kalyan Ram: కళ్యాణ్‌రామ్ సినిమాలో బాలీవుడ్ నటుడు
హీరోలలో కొందరు హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కథలను చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : హీరోలలో కొందరు హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కథలను చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. NKR21 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సోహైల్ ఖాన్ ( Sohail Khan ) బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. ఈ సినిమాలోని లుక్‌ను విడుదల చేశారు. స్టైలిష్ లుక్ లో కనిపించరు. కాగా.. ఈ సినిమాతోనే ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.
కళ్యాణ్ రామ్ సినీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) కి జోడిగా సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తోండగా విజయశాంతి, శ్రీకాంత్‌లు నటిస్తున్నారు.