Anil Ravipudi: స్టార్ హీరోలతో అనిల్ రావిపూడి కొత్త సినిమా.. వారెవరో తెలుసా!
వచ్చే ఏడాది ఈ సినిమాని పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi) కాంబినేషన్లో ఓ కొత్త సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ బాగా వినిబడుతోంది. అయితే, ఆ సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా.. లేక 157 అవుతుందనేది తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం, ఆ సినిమా ప్లానింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని పట్టాలెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు ఈ స్టోరీ విషయంలో డైరెక్టర్ అనిల్ ఓ టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కథని చిరంజీవితోనే కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కథలో కొన్ని రకాల మార్పులు చేస్తే, అది మల్టిస్టారర్ గా మారే అవకాశం ఉందని అనిల్ అనుకుంటున్నాడని తెలిసింది. ఇదే నిజమైతే, మెగా-కింగ్ ఫ్యాన్స్ కోరిక తీరిపోతుంది.
చిరు- నాగ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులో మనందరికీ తెలిసిందే. వారిద్దరూ కలిసి బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు చిరంజీవి, నాగార్జునతో (Nagarjuna Akkineni) కలిసి టైంపాస్ చేస్తుంటారు. నాగార్జునతో కలిసి నటించాలని మెగాస్టార్ చాలా కాలాంగా ఆశపడుతున్నారు. కానీ, సరైన స్టోరీ దొరకకపోవడంతో కుదర్లేదు. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను డీల్ చేయడమన్నది అనిల్ కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. `ఎఫ్ -2`,` ఎఫ్ -3` మూవీస్ తో వెంకటేష్- వరుణ్ తేజ్ లను డీల్ చేశాడు. మరి, అనిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేక భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.