Anand Deverakonda: ఆ డైరెక్టర్‌తో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా.. హీరోయిన్‌గా మలయాళి భామ ఫిక్స్..?

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-29 06:42 GMT

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయి.. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే, బేబీ, గం గం గణేశా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా బేబీ సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నడా. కానీ, ఆ తర్వాత వచ్చిన గంగం గణేశ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ వినోద్ అనంతోజుతో ఆనంద్ దేవరకొండ ఓ న్యూ మూవీ చేయబోతున్నాడట. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. లవ్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో.. తాజాగా హీరోయిన్‌గా మలయాళి బ్యూటీ మాళవిక మనోజ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సుహాస్ హీరోగా రూపొందుతున్న ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఈ సినిమా అయినా ఆనంద్ దేవరకొండకి మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News