బోనీని ఎగతాళి చేస్తున్నాడు.. నాగవంశీకి వారి ముందు కూర్చొని మాట్లాడే దమ్ముందా..? డైరెక్టర్ ఫైర్ (ట్వీట్)

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Nagavamsi), సిద్దార్థ్, బోనీ కపూర్(Boney Kapoor), ఇంకా కొంతమంది సినీ సెలబ్రిటీలు కలిసి రౌండ్ టేబుల్ చిట్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-31 14:24 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత నాగవంశీ(Nagavamsi), సిద్దార్థ్, బోనీ కపూర్(Boney Kapoor), ఇంకా కొంతమంది సినీ సెలబ్రిటీలు కలిసి రౌండ్ టేబుల్ చిట్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో హిందీ సినిమాలపై నాగవంశీ సెటైర్లు వేయడంతో బోనీ కపూర్ కూడా అందుకు తగ్గ సమాధానాలు ఇచ్చాడు. ఇద్దరు మా సినిమాలే గొప్ప అన్నట్లుగా వాదించుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, ఈ విషయంపై బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా(Sanjay Gupta), నాగవంశీ‌పై మండిపడ్డారు.

వరుస ట్వీట్లు చేసి ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. ‘‘బోనీ జీ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన ఫేక్ వానిటీతో అతన్ని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు?. అతని బాడీ లాంగ్వేజ్, అసహ్యకరమైన వైఖరి చూడండి. 4/5 హిట్స్ ఇస్తే బాలీవుడ్ బాప్ అయిపోడు. అల్లు అరవింద్(Allu Aravind) సర్ లేదా సురేష్ బాబు(Suresh Babu) సర్ వంటి సీనియర్ నిర్మాతల ముందు కూర్చుని వారి ముఖంలోకి వేళ్లు చూపిస్తూ ఈ విధంగా మాట్లాడే దమ్ము నాగవంశీకి ఉందా. సక్పెస్‌కు ముందు విలువ ఇవ్వడం నేర్చుకోండి అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News