Dhanush: ధనుష్ ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు టైమ్ ఫిక్స్..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) రాయన్, (Captain Miller) సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Update: 2024-12-31 14:49 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) రాయన్, (Captain Miller) సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఫామ్‌తో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’(Kubera). అలాగే ధనుష్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idly kadai). ఇందులో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. డాన్ పిక్చర్స్(Dawn Pictures), వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఇందులో ప్రకాష్ రాజ్, షాలినీ పాండే(Shalini Pandey) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఇడ్లీ కడై’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ధనుష్ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రేపు జనవరి 1న సాయంత్రం 5 గంటలకు లుక్ రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ధనుష్ రెండు టిపిన్లు, ఒక సంచి పట్టుకుని వెళుతున్న పోస్టర్ షేర్ చేశారు.

Tags:    

Similar News