ఒకే ఏడాది అత్యధిక ట్యాక్స్ చెల్లించిన సెలబ్రెటీగా అమితాబ్.. ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 85 ఏళ్ల వయసులోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. దీంతో ఆయన సంపాదన కూడా అంతకంతకూ పెరిగిపోతుంది. తాజాగా బిగ్ బీ దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నాడు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అతని సంపాదన ఏకంగా రూ.350 కోట్లు కావడం విశేషం. ఈ ఆదాయంపై అమితాబ్ 120 కోట్లు వార్షిక పన్ను చెల్లించాడు. దీంతో దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన మేటి నటుడిగా అమితాబ్ పేరు మార్మోగుతోంది.
గతేడాది షారుక్ రూ.92 కోట్ల ట్యాక్స్‌తో తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పుడు బిగ్ బీ ఆ రికార్డును చెరిపేశాడు. కాగా, మార్చి 15, 2025న అమితాబ్ తన చివరి వాయిదాగా రూ. 52.50 కోట్ల ముందస్తు పన్ను చెల్లించారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత అధిక మొత్తం కావడం విశేషం. ఓ నివేదిక ప్రకారం.. అమితాబ్ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ.5 నుంచి రూ.10 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ప్రభాస్ 'కల్కి 2898 AD'లో అశ్వథ్థామ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తదుపరి కల్కి 2 చిత్రీకరణలోనూ పాల్గొననున్నాడు. అలాగే, మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు బచ్చన్ జీ రియాలిటీ షోలు చేస్తున్నాడు. వాణిజ్య ప్రకటనల్లో బిజీగా నటిస్తున్నాడు.
Read More..
MegaStar Chiranjeevi: లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రేపే ఆ పురస్కారంతో సన్మానం?