బ్యాడ్ లక్.. అనుకున్న టైమ్‌కి రాలేకపోతున్న మాళవిక..
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan).. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ వంటి భాషల్లో చిత్రాలు చేసింది.

దిశ, సినిమా: మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan).. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ వంటి భాషల్లో చిత్రాలు చేసింది. కానీ, అనుకుంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇక, ‘పేట, మారన్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. రీసెంట్‌గా వచ్చిన ‘తంగలాన్’(Tangalan) చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సినిమా ఆఫర్లు రావడంతో ప్రజెంట్ తెలుగులో ‘రాజాసాబ్’(Rajasab), తమిళంలో కార్తీ ‘సర్దార్-2’(Sardar-2) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాలతో తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్న ఈ బ్యూటీకి నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా రిలీజైతే.. డార్లింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవచ్చు అనుకుంది. కానీ, ఈ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఏప్రిల్‌కు రిలీజ్ అవుతుంది అనుకుంటే.. ‘రాజాసాబ్’ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడటం పక్కా అని నెట్టింట వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘సర్దార్-2’ తో అయినా తన క్రేజ్ పెరుగుతుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇక్కడ కూడా నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. రీసెంట్‌గా కార్తీకి లెగ్ ఇంజ్యూరీ కావడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ మూవీ కూడా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో అనుకున్న టైంకి ఈ సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో.. ఈ అమ్ముడుకి క్రేజ్ రావడానికి ఇంకొంచెం టైమ్ పట్టేలాగే ఉంది. అయితే.. ఈ రెండే కాకుండా మాళవిక చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ ‘హృదయ పూర్వం’(Hridaya Poorvam). మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ మూవీతో అయినా మాళవికకు మంచి రోజులు వస్తాయేమో వేచి చూడాల్సి ఉంది.
Read More : అర్జున్ రెడ్డి సినిమా కంటే మరింత బోల్డ్‌గా చేస్తా.. షాలిని పాండే షాకింగ్ కామెంట్స్